సహజసిద్ధమైన అందం కోసం ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక దీనికి నిమ్మకాయ చాలా మంచిది. ఎందుకంటే టాన్ ను తొలగించే గుణం నిమ్మ కాయలో ఉంటుంది. నిమ్మ కాయ , తులసి ఆకుల రసం సమపాళ్ళలో తీసుకుని వాటిని మిక్స్ చేసుకుని రోజూ రెండుసార్లు ముఖానికి బాగా పట్టించండి. ఖచ్చితంగా అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.ఇక అలాగే మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక పదినిమిషాల తర్వాత నెమ్మదిగా మసాజ్‌ చేయండి.. నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది.ఇక అలాగే పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. ఆ తర్వాత పాలను ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా రోజూ కూడా ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం సహజంగా మెరిసిపోతుంది. ఇక అలాగే పచ్చిపాలు,ఇంకా పసుపు మిశ్రమం అనేది చర్మంలో నునుపు కలిగించడంతో పాటు నలుపు రంగును క్రమంగా తగ్గిస్తుంది.

ఇక బంగాళా దుంపల రసానికి కూడా టాన్ ను తగ్గించే గుణం ఉంది. ఈ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత శుభ్రపరచుకుంటే చాలా మంచిది. ఇలా వారానికి రెండు,మూడు సార్లు చేయడం వల్ల టాన్‌ తగ్గి ముఖం సహజంగా మెరుస్తుంది.అలాగే శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మానికి అప్లై చేసుకున్నాక కొంచెం తడిపొడిగా ఉన్న సమయంలో అరచేతితో.. మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి వెంటనే తొలగిపోతుంది. ఫలితంగా శరీరం కాంతి వంతంగా మారుతుంది.ఇక గంధం పొడిని, అలాగే పసుపు, ఇంకా రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే.. ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది.అలాగే నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా తయారుచేయాలి.ఇక ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజుకి ఒక గంటసేపు ఉంచు కోవాలి.ఇలా రాత్రిపూట రోజు దీన్ని ఇలా రాసుకోవాలి. ఇక పడుకుని తెల్లవారిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖానికి మంచి న్యాచురల్ గ్లో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: