మనలో చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు, కళ్ళ కింద ఉబ్బు ఉంటాయి. సాధారణం గా కనిపించే ఈ సమస్య అందాన్ని పాడు చేయడమే కాక ఆత్మ విశ్వాసం పై ప్రభావం చూపుతుంది. అయితే వయసు మీద పడటం వల్ల కొందరికి ఈ సమస్య వస్తే కొందరికి వంశపారంపర్యంగా వస్తుంది. నేటి సమాజంలో కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపటం, లేట్ నైట్ పడుకోవడం వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. అయితే వీటిని ఇంట్లో ఉండే వాటితోనే సంపూర్ణంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

పాలు: పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లం వలన చర్మం తేమగా ఉంటుంది. ఇదే కళ్ళ చుట్టూ ఉండే ఉబ్బు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. చల్లటి పాలలో రెండు కాటన్ బాల్స్ ముంచి వాటిని 15 నిమిషాల పాటు కళ్ళ మీద పెట్టుకుని ఉండాలి. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేయాలి. ఎంత ఎక్కువగా చేస్తే అంత మెరుగైన ఫలితం ఉంటుంది.

 
పసుపు: పసుపు సహజంగా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నల్లని మచ్చలను తొలగిస్తుంది. పావు స్పూన్ పసుపును కొబ్బరి నూనె లేదా బాదం నూనె లో వేసి ముద్దలా కలపాలి. ఆ మిశ్రమాన్ని కంటి చుట్టూ పట్టించి కాసేపాగి చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

 
నిమ్మ రసం: నిమ్మలో ఉండే సి విటమిన్ వల్ల చర్మంపై మచ్చలను తొలగించి, తేటగా మారుస్తుంది. నిమ్మరసంలో కాటన్ బాల్స్ ముంచి కంటి చుట్టూ రాయండి. కాసేపాగి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా ఉదయం, రాత్రి పడుకునే ముందు చేయాలి. అయితే ముఖం కడిగాక మాయిశ్చరైజర్ క్రీంరాయాలి.


బంగాళదుంపలు:  వీటికి చర్మం రంగుని తేలిక పరుస్తుంది. అలాగే కళ్ళ చుట్టూ వున్నా నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. బంగాళదుంప ని ఒక గంట ఫ్రిజ్ లో ఉంచి తీసి తురిమి రసం తీయాలి. ఆ రసాన్ని పడుకునే ముందు కంటి చుట్టూ రాయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: