ఇక ఈ రోజుల్లో చాలా మంది లైట్ మేకప్ ఎక్కువగా వేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మీకు కూడా లైట్ మేకప్ నచ్చినట్లయితే  మీరు ప్రతి రోజు దీన్ని ఫాలో అవ్వొచ్చు. ఇక దీని కోసం మీ ముఖాన్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీ కళ్లపైన లైట్ గా మేకప్ వేసుకొని కంటి కింద పడే నీడ మీద కాస్త మేకప్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మీ బుగ్గలపై లైట్ బ్రౌన్ కలర్ బ్రష్ ను వాడండి. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్ లిప్ స్టిక్ ను పెదాలపై అప్లై చేయండి చాలా అందంగా కనిపిస్తారు.ఇక పండుగ లాంటి సమయాల్లో మీరు అందరి కంటే అందంగా ఇంకా నలుగురిలో మీరే చాలా ఆకర్షణగా కనబడాలంటే ఖచ్చితంగా మీరు మీ కంటి కింద బంగారం కలర్లో ఉండే లైనర్ ను అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఐలైనర్ ని వాడాలి. ఇది మీ కళ్లకు ఎంతో అందమైన రూపాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత లైట్ పింక్ కలర్ బ్లష్ చేయండి. ఇక ఆ తరువాత మీ చర్మంపై మీకు నచ్చిన రంగులో మేకప్ వేసుకోండి.ఆ తర్వాత ఏదైనా లిప్ స్టిక్ వేసుకుంటే మీరు కొంచెం కొత్తగా ఇంకా చాలా అందంగా కనిపిస్తారు.ఇక చాలా మంది మహిళలు కూడా పండుగ సమయంలో పింక్ లిప్ స్టిక్ తో మేకప్ వేసుకుంటూ వుంటారు. కాబట్టి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి.

ఇక ముందుగా మీరు బేస్ మేకప్ ని చేసుకుని ఇక ఆ తర్వాత పింక్ మేకప్ కోసం ప్రయత్నించండి. అలాగే ముఖ్యంగా మీ కళ్లపై పింక్ ఐషాడోని వేయండి. ఇక ఆ తర్వాత పింక్ లిప్ స్టిక్ ను అప్లై చేయడం ద్వారా మీ మేకప్ ను పూర్తి చేయాలి.ఇక ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కూడా పింక్ మేకప్ ను చాలా ఇష్టపడుతున్నారు. ప్రతి పండుగ సమయంలో పింక్ మేకప్ ని ఖచ్చితంగా వేసుకుంటారు.ఇక కొంతమంది మహిళలు అయితే మేకప్ అంటే చాలు పడి చచ్చిపోతుంటారు. అందుకే ఎక్కువగా మేకప్ వేసుకోవడాన్ని మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. అయితే అలాంటి మహిళలంతా కూడా స్మోకీ ఐ మేకప్ ని వేసుకోవచ్చు. స్మోకీ లుక్ కోసం, మొదట సరైన ఫౌండేషన్ ఇంకా కన్సీలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఫేస్ పై బ్రౌన్ ఇంకా డార్క్ కలర్ ఐ షాడోను ఖచ్చితంగా అప్లై చేయాలి. అలాగే స్మోకీ లుక్ కోసం ఖచ్చితంగా డార్క్ కలర్ ఐ షాడోనే వాడాలి. ఆ తర్వాత లైట్ గా లిప్ స్టిక్ వాడాలి. ఒక వేళ మీకు డార్క్ లిప్ స్టిక్ వేసుకోవాలనిపిస్తే అది కూడా మీ పెదాలపై అప్లై చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: