జుట్టు పొడిబారి పోయి పీచు పీచుగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి వారు కొన్ని సహజ పదార్థాలను వినియోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య నుండి బయటపడొచ్చు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ముందుగా దువ్వెనను విడిగా పెట్టుకుని వాడటం అలవాటు చేసుకోవాలి. చుండ్రు ఉన్నా లేకున్నా ఇతరుల దువ్వెనలను మీరు వాడరాదు. అలాగే మీ దువ్వెనను ఇతరులకు ఇవ్వరాదు. ఎందుకంటే అలా ఒకరి దువ్వెన మరొకరు వాడటం వలన చుండ్రు, ఇన్ఫెక్షన్లు వంటివి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఒకే కుటుంబంలోని వ్యక్తులు అయినా సరే విడిగా దువ్వెనను పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.
* అందరికీ అందుబాటులో ఉండే వేపాకు ఆరోగ్య పరంగా ఎన్ని రకాల మేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అదే విధంగా చుండ్రుని నివారించడంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడేవారు కొంత వేపాకును తీసుకుని కడిగి శుభ్రపరచుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్టును తలకు బాగా పట్టించాలి. ముఖ్యంగా కుదుళ్లకు బాగా అంటాలి. ఒక గంట ఆగి గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన చుండ్రు సమస్య దూరమవుతుంది. కనీసం వారానికి ఒకసారైనా వేపాకు పేస్ట్ ను తలకు అంటాలి.