
అందులో ఒక సహజమైన రెండు పద్దతులను ఇక్కడ మీతో పంచుకుంటున్నాము. బియ్యపు పిండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చక్కగా ఉపయోగపడుతుంది. బియ్యపు పిండిని కొన్ని పదార్థాలతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వలన చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఆ మిశ్రమాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెండు స్పూన్ల బియ్యపు పిండిని తీసుకుని అందులో టమోటా పేస్ట్ ను కలిపి ముఖంపై గుండ్రంగా రాయాలి. ఇలా కనీసం ఒక ఐదు నిమిషాలైనా మర్దన చేసుకోవాలి. అలాగే మెడ భాగంలో కూడా రాసుకోవాలి. ఆ తర్వాత ముఖం కదిలేలా మాట్లాడటం వంటివి చేయకూడదు. ఇక ఇరవై నిముషాలు ఆగి కడిగేయాలి. కనీసం ఒక ఒక అరగంట సేపు అయినా సోపును వాడరాదు. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేసుకోవచ్చు.
* అలాగే ఒక స్పూన్ బియ్యపు పిండిలో ఒక స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూయాలి ఒక అరగంట ఆగి ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బియ్యపు పిండి వలన ముఖంపై చర్మ రంధ్రాల్లో దాగి ఉన్న మురికి క్లీన్ అవుతుంది. అలాగే చర్మం మెరుస్తూ మృదువుగా తయారవుతుంది.