* నిమ్మకాయ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్న నిమ్మకాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం తెలిసిందే. ఇది చర్మానికి సహజమైన బ్లీచింగ్ లా వినియోగించుకోవచ్చు తద్వారా ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి కాంతి వంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను మాయం చేయడానికి ఉపయోగపడే ఎక్స్‌ఫోలియేటర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది.
ఇపుడు ఇది ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో, రెండు కప్పుల వరకు చక్కెరను వేయాలి అందులో అర చెక్క లేదా పూర్తి నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేస్తూ పదినిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఒక అరగంట ఆగి గోరు వెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. అంతే అవాంఛిత రోమాలకు ఇలా గుడ్ బై చెప్పేయొచ్చు.