సాధారణంగా మన శరీరంలో విటమిన్-డి లోపం ఉండడం వల్ల చర్మం మసకబారడం, జుట్టు మరింత వేగంగా రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.. ఎవరైనా సరే అందంగా ఉండాలని వయసు పెరిగినా కూడా అది ముఖంలో కనిపించకుండా ఉండాలని ఆశపడే వారు చాలామంది ఆశ పడుతూ ఉంటారు అని చెప్పవచ్చు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చుపెట్టి క్రీములు రాయాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం కొన్ని రకాల ఆహారాలు తింటే యవ్వనంగా చాలా సంవత్సరాలు మెరిసిపోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి 30 సంవత్సరాల తర్వాత ప్రతి అమ్మాయిలు కూడా అదనపు పోషణ , సంరక్షణ ,క్యాల్షియం అనేవి అవసరమవుతాయి.. ఇక నిత్యం యవ్వనంగా మచ్చలు లేకుండా ఉండాలి అంటే 30 సంవత్సరాల తర్వాత మనం తీసుకునే రోజు వారి ఆహారంలో కొన్ని పప్పులను చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మహిళలు 30 సంవత్సరాల తర్వాత క్యాల్షియంను కోల్పోతారు.. ప్రోటీన్ కూడా సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు వేగంగా విరిగిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. కాబట్టి విటమిన్ డి లోపం ఉండకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చిక్కుళ్ళు, సాల్మన్ చేపలు బాగా తినాలి. వీటిని తినడం వల్ల చర్మం పాడవకుండా విటమిన్ డి కూడా లభిస్తుంది.