తడి జుట్టు దువ్వడం:
తడిగా ఉన్నప్పుడు మనం జుట్టును కుదుళ్ల నుంచి దువ్వడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా తయారవుతాయి. ఫలితంగా తప్పకుండా ఎక్కువ వెంట్రుకలు ఊడి పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు జుట్టు చివర్లు చిట్లి పోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి..కాబట్టి ఈ వెంట్రుకలను ఎప్పుడూ కూడా తడి మీద దువ్వకుండా పూర్తిగా ఆరిన తర్వాతనే దువ్వుకోవడం చాలా మంచిది.
తడి జుట్టు తోనే పడుకోవడం..
చాలామంది తమ పనులను పూర్తి చేసుకున్న తర్వాత తడి జుట్టు తోనే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువగా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఆరబెట్టి ఆపై పడుకుంటే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.
జుట్టు పై హెయిర్ డ్రైయర్లను ఉపయోగించడం..
తడి జుట్టుపై హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల జుట్టుకు అత్యంత ప్రమాదకరం.. తడి జుట్టు త్వరగా వేడిని గ్రహిస్తుంది కాబట్టి జుట్టును బలహీనపరుస్తుంది.
తడి జుట్టును టవల్ తో రుద్దడం..
తడి జుట్టును టవల్ తో రుద్దడం వల్ల జుట్టు ఇంకా బలహీనం అవుతుంది. అంతేకాదు జుట్టు త్వరగా తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆరబెట్టుకోవాలంటే కేవలం రెండు చేతుల మధ్య టవల్ పెట్టి మెత్తగా జుట్టును నొక్కాలి ..అప్పుడు అదనపు నీరు ఆవిరై పోతుంది.. కాబట్టి జుట్టు త్వరగా పాడైపోయే అవకాశం ఉండదు.