సాధారణంగా చిన్న పిల్లల తలలో ఈ పేలు ఎక్కువగా ఉంటూ వారికి అన్ని పనులకు అడ్డం కలిగిస్తూ ఉంటాయి. అంతే కాదు ఇవి తలలో చేరి స్కాల్ఫ్ మీద కొరుకుతూ ఉండడం వల్ల పిల్లలకు దురద ఎక్కువగా అనిపించి, రెండు చేతులతో తలపై రుద్దుతూ దురద తో సతమతమవుతూ ఉంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలకు ఒకరి నుంచి మరొకరికి ఈ పేలు అనేవి వ్యాపిస్తాయి. ఈ పేలు అనేవి కేవలం పిల్లల నుంచి పిల్లలకే కాదు.. పిల్లల నుంచి వారి తల్లిదండ్రులకు కూడా పాకుతూ ఇలా ఇంటిల్లిపాదికి చికాకు కలిగిస్తూ ఉంటాయి.

వీటిని దూరం చేసుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేయడంతో పాటు మార్కెట్లో దొరికే విష పూరితమైన రసాయనాలు కలిగిన నూనెలను తీసుకొచ్చి.. జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల స్కాల్ఫ్ పాడవడమే కాకుండా జుట్టు కూడా అధికంగా వూడిపోయే ఆస్కారం ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పేలను దూరం చేసే చిట్కాలు ఏంటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

సాధారణంగా మన ఇంటిలో అందరికీ సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో ఈ చికాకు తెప్పించే పేల సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.ఇందుకోసం మీరు చేయవలసిందల్లా 5 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో వెల్లుల్లి పేస్ట్ వేసి.. దానిలో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కేవలం హాఫ్ టేబుల్ స్పూన్  నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు అంతా పట్టించాలి. ఒక గంట తర్వాత గాఢత తక్కువ కలిగిన తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఆ తర్వాత జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే శుభ్రంగా వుండే దువ్వెనతో దువ్వితే పేలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పద్ధతిని వారంలో రెండు సార్లు చేస్తే పేలు సమస్య త్వరగా  వదిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: