సపోటా పండు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఇవి మన శరీర ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడతాయని ఒక అధ్యయనంలో తేలిందట. ఇందులో ఉండేటువంటి కొన్ని పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు చర్మ సౌందర్యాన్ని బాగా పెంపొందిస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడుతాయి ఈ పండ్లు.. అందుచేతనే వైద్యులు వీటిని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీరి గురించి చూద్దాం.

ఈ పండ్లకి మరొక పేరు చీకు.. ఇవి తినడానికి చాలా మృదువుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సపోటా పండు ఆరోగ్యానికి ఒక దివ్యౌషధమని చెప్పవచ్చు. ఇందులో ఇనుము, అనామ్లజనకాలు, విటమిన్స్ వంటివి బాగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ బాగా ఉండడంచేత చర్మం, జుట్టు వంటివాటిపై వీటి ఫలితం బాగా ఉంటుందట. అందుచేతనే ఇప్పటినుండి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శరీరంలో అన్ని భాగాలకు దీని ఫలితం లభిస్తుందట. చర్మం కాంతివంతంగా ఎల్లప్పుడూ ఉండాలంటే.. ఈ పండు గుజ్జుని తీసుకొని పెరుగు, నిమ్మరసం వేసి అన్ని బాగా కలుపుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా రాసుకొని కాసేపు ఆగిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో బాగా కడుక్కోవడం వల్ల.. ముఖంపై పింపుల్స్, అందుకు సంబంధించి మచ్చలు కూడా తగ్గుతాయి అని కొంతమంది తెలియజేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా ముఖం మీద పడిన మడతలను కూడా ఇవి మటుమాయం చేస్తాయట.

ఒక కప్పులో బాగా మాగిపోయిన సపోటా పండు గుజ్జును తీసుకుని.. బేకింగ్ సోడా ని అందులో వేసి బాగా కలుపుకుని ముఖానికి పట్టించుకున్నట్లు అయితే చర్మం మీద ఉండే చిన్న చిన్న కణాలు తగ్గిపోతాయట. దీంతో  ముఖం బాగా మెరిసిపోతుంది. జుట్టు బాగా మృదువుగా రావాలంటే సపోటా విత్తనాల నుంచి వచ్చే నూనెను జుట్టుకి పట్టించినట్లయితే.. అవి ఒత్తుగా పెరుగుతాయట. అంతేకాకుండా చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: