ఇక ఈ వేసవి కాలంలో శరీర వేడి వల్ల వచ్చే మొటిమలను వేడి మొటిమలు అంటారు. ఇవి బుగ్గలు ఇంకా అలాగే నుదిటిపై ఏర్పడుతాయి. వీటిని వదిలించుకోవడం అనేది అంత సులభం కాదు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోకపోవడం ఇంకా అలాగే మద్యం ఎక్కువగా తాగడం, బ్యాక్టీరియా ఇంకా అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం మొదలైన కారణాల వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి.అయితే వీటిని కొన్ని హోం రెమిడిస్ ద్వారా ఈజీగా తొలగించుకోవచ్చు. నిజానికి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మొటిమలు అనేవి ఏర్పడుతాయి. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మంచి యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. ఇది వేడి మొటిమలను తొలగించడంతో పాటు వాపును కూడా తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.ఇక తేనెను అప్లై చేయడం వల్ల ముఖం బాగా చల్లబడుతుంది. మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఒక పెద్ద చెంచాలో తేనె తీసుకుని దానికి కొద్దిగా పచ్చి పాలను కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై వుండే మొటిమలపై అప్లై చేయండి.



ఇక మొటిమలకు పసుపు అనేది చాలా మంచి విరుగుడు. ఇందులో కర్కుమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది మొటిమల వల్ల కలిగే మంటను చాలా ఈజీగా తగ్గిస్తుంది. పసుపు పొడిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి, ఆ తరువాత మొటిమల మీద రాసి కాసేపు బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత కడిగితే మీకు మంచి ఉపశమనం అనేది ఉంటుంది.వేడి మొటిమలను తొలగించడంలో నిమ్మకాయ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది మీ చర్మానికి చాలా మేలుని చేస్తుంది. నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనెను మిక్స్ చేసి ముఖంపై వుండే మొటిమలపై అప్లై చేయాలి. ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో మీ ముఖం కడుక్కోవాలి.కలబంద మీ చర్మానికి చాలా మంచిది. ఇది ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గిస్తుంది. వేడి మొటిమలకి ఇదో చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అలోవెరా జెల్‌ని ముఖంపై వుండే మొటిమలపై పూయాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు కనుక ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై వేడి మొటిమలు చాలా ఈజీగా తగ్గుముఖం పడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: