చాలా మంది కూడా అందంగా ఇంకా ఆరోగ్యంగా వున్నా కూడా నోటి దుర్వాసన సమస్యతో చాలా బాధపడుతూ ఉంటాం. ఇది ఎవరో ఒకరి సమస్య కాదు. దాదాపు చాలా మంది ఈనోటి దుర్వాసన సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.కొందరికి బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన సమస్య పోదు. దీనికి ప్రధాన కారణం.. నోటిలో లాలాజలం లేకపోవడమే. మనం రాత్రి పడుకున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నోరు పొడిబారుతుంది. ఈలాలాజలం సాధారణంగా దుర్వాసన కలిగించే కణాలను బటయకి పంపుతుంది. నిద్రిస్తున్న సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవటంతో నోటిలో బాక్టీరియా పెరిగిపోయి ఉదయం పూట దుర్వాసనగా అనిపిస్తుంది. ఈసమస్యకు చెక్ పెట్టేందుకు లేవగానే మొదట బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నప్పటికి కొన్ని సార్లు నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. నోటి దుర్వాసన అనేది వ్యక్తి  ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, నోటి సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం అలవాటుచేసుకోవాలి. భోజనం చేసిన తరువాత అయితే నోటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.


ఎక్కువ మంది తిన్న తర్వాత నీరు తాగి తమ పనుల్లో నిమగ్నమైపోతారు. పళ్లు లోపల, చిగుళ్లలో ఇరుక్కున ఆహారం సమయం గడిచే కొద్దీ నోటి దుర్వాసనను కలిగిస్తుంది. అందుకే ఏదైనా తిన్న తర్వాత నోటిని పుక్కిలించిడం, నీటితో నోరు కడుక్కోవడం వంటివి చేయాలి. నోటి దుర్వాసనను నివారించాలనుకునే వారు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి సమయాల్లో పడుకోవడానికి విశ్రమించేటప్పుడు దంతాలను బ్రష్ చేయటానికి ప్రయత్నించాలి. ఇప్పటికే రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ నోటి దుర్వాసన సమస్యను అనుభవిస్తుంటే, అలాంటి సందర్భంలో రోజుకు కనీసం ఒకసారైనా మౌత్ వాష్ లేదా ఫ్లాసింగ్ చేసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కహాల్ వంటివి నోటి దుర్వాసనను పెంచుతాయి. నోటి దుర్వాసనను అధిగమించాలని అనుకుంటే ఈ రకమైన ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: