ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు పెరగాక పోవడం లేదా రాలిపోవడం వంటిది సర్వసారాధనంగా మారుతోంది.. జుట్టు మరి ఎక్కువగా రాలుతుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సిందే.. అయితే జుట్టు రాలిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి ముఖ్యంగా హార్మోన్ల సమస్యతో ఇబ్బంది పడడంతో పాటు అనారోగ్యకరమైన జీవనశైలి,వాయు కాలుష్యం తదితర కారణాలు కూడా కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం కూడా జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం అవుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే విటమిన్ -C,D వంటి ప్రోటీన్లు తగ్గితే జుట్టు వేగంగా రాలిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే తరచూ జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్నిటిని ఎక్కువగా తినకపోతే సరిపోతుంది..వాటి గురించి చూద్దాం.

1). తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మన శరీరం చాలా హానికరంగా మారుతుంది కొంతమంది నివేదికలు తెలిపిన ప్రకారం చక్కెరను ఎక్కువగా తీసుకుంటే బట్టతల రావడానికి ముఖ్య కారణమట. అందుచేతనే చక్కెర వంటి పదార్థాలను ఎక్కువగా తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు


2). చేపలలో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాట్స్ ఉండడం వల్ల.. వీటిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుందట.అందుచేతనే వీటిని ఎక్కువగా తినకూడదు.. ప్రస్తుతం  దొరికే చేపలలో ఎక్కువగా  పాదరసం కూడా ఉంటుంది ఇది శరీరానికి అనేక విధాలుగా హానికరంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.


3). బయట దొరికేటువంటి జంక్ ఫుడ్ లను వీలైనంతవరకు తగ్గించడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోగులు ఇలాంటి జంక్ ఫుడ్ తినకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఇందులో సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరం చర్మం జుట్టు హానికరాన్ని కలిగిస్తాయి అందుచేతనే ఇలాంటి వాటిని తక్కువగా తినడం మంచిది అంతే కాకుండా రక్తప్రసరణ తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని చాలా దెబ్బతినేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: