టీనేజ్, యంగేజ్ లో వున్నప్పుడు మొటిమలు రావడం అనేది సర్వసాధారణమే.కానీ వయసుతో సంబంధం లేకుండా పెద్దవారిలో కూడా మొటిమలు వస్తే అది చర్మ  సంబంధిత సమస్యేనని గుర్తించాలి.వీటిని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద టిప్స్ చెబుతున్నారు సౌందర్య నిపుణులు. సమతుల్యమైన జీవనశైలి, మంచి ఆహారపుటలవాట్లు, చురుకుగా ఉండటం, మేలైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బ్యూటీ టిప్స్ వాడటం ద్వారా మొటిమల సమస్యకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చని అంటున్నారు.టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో చాలా మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.ఇందుకోసం కొన్ని ప్యాక్స్ వాడొచ్చు. ముందుగా రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి.ఇందులో కాస్తా తేనె కలపాలి.. ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం, మెడని శుభ్రం చేసుకుని ముఖంపై రాయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.ఇంకా కాసింత శనగ పిండిని తీసుకోండి. అందులో ఇప్పుడు టమాట  గుజ్జుని అందులో కలపాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.


ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. ముఖ రంగుని మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది .ఇంకా అలాగే ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కాస్తా ముల్తానీ మట్టి తీసుకోండి. అందులో టమాట జ్యూస్ వేసి బాగా కలపండి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖంపై వేసుకోండి.. చల్లని నీటితో కడగండి.ఇలా చేయడం వల్ల చాలా వరకూ తగ్గుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చడంలో టమాటా బాగా పనిచేస్తుంది.కొద్దిగా టమాట రసం తీసుకుని అందులో కాస్తా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి.కాస్తా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల ట్యాన్  సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. ఖచ్చితంగా చాలా అందంగా తయారు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: