ఉప్పు పెదాలపై పొడి పొరలను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గం. ఒక టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలుపుకుని, పెదాలపై స్క్రబ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం కఠినంగా ఉంటుంది. కొబ్బరి నూనె పెదాలను లోతుగా తేమ చేస్తుంది. ఈ స్క్రబ్ పెదాలను మృదువుగా ఉంచుతుంది.ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది పెదాలను మృదువుగా, హైడ్రేట్‌గా మార్చుతుంది. కోకో పౌడర్ ఒక అద్భుతమైన సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్. ఇది పెదాలను మృదువుగా, అందంగా ఉంచుతుంది. ఒక స్పూన్‌ కోకో పౌడర్‌లో, ఒక స్పూన్‌ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి పెదాలపై 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని, శుభ్రం చేసుకోవాలి.చక్కెర సహజంగా చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి పెదవి పిగ్మెంటేషన్ లేదా డార్క్ పెదాలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్‌ చక్కెరలో ఒక స్పూన్‌ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో వృత్తాకారంలో పెదవులపై కొన్ని నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి.


ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ పంచదార మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేసుకోండి. చక్కెర కణాలు కరిగిపోయే వరకు ఈ మిశ్రమంతో సున్నితంగా మర్దన చేయండి. తేనె పెదాలను తేమగా ఉండాలా చేస్తుంది. చక్కెర పెదవుల నుంచి పొడి పొరలుగా ఉండే చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.కాఫీ గొప్ప ఎక్స్‌ఫోలియేటర్. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలకు పోషణనిచ్చి వాటిని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ కాఫీకి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేసి 2-3 నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకుని, తర్వాత శుభ్రం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: