మొటిమలు ఈజీగా పోవాలంటే ఇలా చెయ్యాల్సిందే ?
మొటిమల సమస్య అనేది ప్రతి ఒక్కరికీ కూడా సర్వసాధారణం. ఒక్కసారి వచ్చిందంటే ఈ సమస్య అసలు పోనే పోదు.జిడ్డు చర్మం ఉన్నవారి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి.. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు.ఆ కారణాలు ఏంటో తెలుసుకొని వాటి నివారణకు కావాల్సిన టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.మొటిమలను నివారించడానికి, మీ ముఖం మీద నూనె పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది కాకుండా నిద్రపోయే ముందు మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై పేరుకుపోయిన ఆయిల్ క్లీన్ అవుతుంది.మన ఆహారం, కూల్‌డ్రింక్స్ కూడా మొటిమలను పెంచడంలో దోహదపడతాయి.. మొటిమల సమస్య అనేది చాలా మందిలో వచ్చినప్పటికీ, జిడ్డుగల చర్మంపై ఇది ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని పదార్థాలను తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.బంగాళదుంపలు, పుచ్చకాయలు, కేకులు, కుకీలు వంటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు IGF1 హార్మోన్‌ను పెంచుతాయి. ఇది మొటిమలను కలిగిస్తుంది. అందుకే ఈరోజు నుండే వీటిని తీసుకోవడం మానేయాలి.పాల ఉత్పత్తులు అంటే పాలతో చేసిన వస్తువులు కూడా మొటిమలను ప్రోత్సహిస్తాయి. మీరు ఈ వస్తువులన్నింటినీ తినడం ప్రారంభించినప్పుడు. అప్పుడు మీ హార్మోన్ల అసమతుల్యత చర్మంపై మొటిమలకు దారి తీస్తుంది. మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు పాల ఉత్పత్తులను తీసుకుంటుంటే, ఈ రోజు నుండి వాటి వినియోగాన్ని ఆపేయండి.. ఇలా చేయడం ద్వారా మీరు మొటిమల సమస్యను నివారించవచ్చు.చర్మంపై మొటిమలు ఉంటే, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. హార్మోన్లతో పాటు, చక్కెర కూడా వాపును ప్రభావితం చేస్తుంది. మీరు అలాంటి ఆహారాన్ని తీసుకోవడం మానేస్తే, అది ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు.మొటిమలు ఈజీగా పోవాలంటే ఇలా చెయ్యాల్సిందే..