చర్మాన్ని సంరక్షించడంలో కీరదోస చక్కగా పని చేస్తుంది.కీరదోసను గుండ్రంగా ముక్కలుగా చేసి కళ్లపై పెట్టుకుని కొద్ది సేపు అలాగే ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు, ముడతలు తొలగిపోతాయి. అదేవిధంగా కలబందను ఉపయోగించి కూడా ఉబ్బిన కళ్లను సాధారణ స్థితికి తీసుకు రావచ్చు. కళ్ల చుట్టూ కలబంద గుజ్జును రాయడం వల్ల ఉబ్బిన కళ్లను మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఈ కలబంద గుజ్జును రాయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కంటికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కళ్ల చుట్టూ కలబంద గుజ్జును రాసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఈ చిట్కాలను తరచూ వాడడం వల్ల ఉబ్బినట్టుగా ఉండే కళ్లు సాధారణ స్థితికి వస్తాయి. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించి కూడా ఐ బ్యాగ్స్ ను తగ్గించుకోవచ్చు. గుడ్డులో చర్మాన్ని రక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి.
దీనికోసం ముందుగా రెండు గుడ్లలోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ తెల్లసొనను బాగా కలిపి ఒక మెత్తటి బ్రష్ తో తీసుకుని కళ్ల చుట్టూ రాయాలి. ఈ మిశ్రమం పొడి బారేవరకు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తరువాత కళ్లను శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇక కళ్లను సాధారణ స్థితికి తీసుకురావడంలో కీరదోస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే ప్రతిరోజూ ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీని వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే అధికంగా ఉండే ఉప్పు నుండి మన శరీరం కాపాడబడుతుంది. అలాగే ఉబ్బిన కళ్లను మామూలుగా చేయడంలో టీ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను సంరక్షిస్తాయి. రెండు టీ బ్యాగ్ లను తీసుకుని వాటిని వేడి నీటిలో ఉంచాలి. తరువాత ఒక్కో టీ బ్యాగ్ ను ఒక్కో కంటి మీద 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఇలా చేసిన కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు ఈజీగా పోతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: