మీ జుట్టు ఆకస్మికంగా రాలడానికి ఒత్తిడి అనేది కూడా ఒక ప్రధాన కారణం. వ్యాయామం, ధ్యానం, యోగా.. రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎదుర్కొంటారు. దీని ఫలితంగా ఆండ్రోజెన్‌లు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ముఖం ,శరీరంపై జుట్టు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. అలాగే తలపై వెంట్రుకలు పలుచబడుతాయి. మొటిమలు రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.థైరాయిడ్ గ్రంధి ఎక్కువ లేదా తక్కువగా థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తే జుట్టు పెరుగుదల చక్రం మారుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి జుట్టు రాలడం, బరువు పెరగడం లేదా తగ్గడం, గుండె స్పందన రేటులో మార్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి.30 ఏళ్ల తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో జుట్టు ఊడిపోవడం కనిపిస్తుంది. స్త్రీ శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రధాన హార్మోన్ ఈస్ట్రోజెన్. డీహెచ్‌ఈఏ అనే హార్మోన్‌ కూడా స్త్రీల శరీరంలో ఉత్పత్తి అవుతుంది.


మహిళలు ఒక నిర్దిష్ట వయస్సుకి చేరుకున్నప్పుడు ఆండ్రోజెన్‌ అనే హార్మోన్‌ డీహెచ్‌ఈఏ మారే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు జుట్టు రాలిపోతుంది.రోజు వారి ఆహారంలో ఐరన్, కాపర్, జింక్, ప్రొటీన్లు వంటి అవసరమైన పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టురాలుతుంది. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం విటమిన్ డి లోపం. దీన్ని నివారించడానికి ప్రతి రోజూ ఆరుబయట కాసేపు ఎండలో కూర్చుంటే సరి.జుట్టు చాలా పెళుసుగా ఉంటుంది. అందువల్ల తడిగా ఉన్నప్పుడు దువ్వితే విరిగిపోయే అవకాశం ఉంది. జుట్టు పూర్తిగా ఆరబెట్టుకుని ఎండబెట్టి, పెద్ద పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వాలి.వేడి నీరు తలపై ఉండే సహజ నూనెలను తొలగిస్తుంది. జుట్టు పొడిగా, నిర్జీవంగా మార్చి, విరిగిపోయేలా చేస్తుంది. అందువల్ల తలస్నానం చేయడానికి వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చని లేదా చల్లని నీళ్లను ఉపయోగించడం బెటర్‌.ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టును కత్తిరించుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: