ప్రస్తుతం చాలా మంది ముఖంపై ముడతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చర్మం బిగుతుగా ఉండడానికి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే చర్మం ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.అలాగే ప్రస్తుతం చాలా మంది దిమ్మల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కురుపులపై ఈ వెల్లుల్లి రెబ్బలను పెస్ట్‌లా చేసి అప్లై చేయండి.అలాగే సాగిన చారలను తొలగించుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఒక టేబుల్ స్పూన్‌లో ఆవాల నూనెను వేడి చేసి అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇలా వేసిన వాటిని కొంచెం ఎర్రబడ్డాకా..ఈ నూనెను చర్మపు చారలపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..ఇంకా అలాగే చాలా మందికి కూడా వాతావరణంలో మార్పులు కారణంగా మొటిమలు వస్తున్నాయి.


అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లి మొగ్గలను పేస్ట్‌గా తయారు చేసి.. అందులో అర టీస్పూన్ వైట్ వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖమంతా బాగా అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే మొటిమల సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.వెల్లుల్లిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. వీటిన క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా చర్మ సమస్యలకు కూడా సులభంగా చెక్‌ పెడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందికి సందేహం కలగవచ్చు . వెల్లుల్లి వల్ల చర్మానికి ఎలా ప్రయోజనాలు కలుగుతాయని.. కానీ ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను కూడా సులభంగా తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని మొటిమల నుంచి ముడతల వరకు తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: