ఎలాంటి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరిగే టిప్ ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మనం కొబ్బరి నూనెను, బాదం నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, ఆముదం, ఉల్లిపాయ, మిరియాలు, వెల్లుల్లిని ఉపయోగించాల్సి ఉంటుంది.కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు జుట్టు బాగా పరిగేలా చేస్తాయి. చుండ్రును నివారిస్తాయి. అలాగే వెల్లుల్లిలో సల్ఫర్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలను దృఢంగా చేయడంలోనే కాకుండా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఆముదంలో మన జుట్టుకు అవసరమయ్యే పోషకాలతోపాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. బాదం నూనె జుట్టును మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఈ నూనెను తయారు చేయడానికి  ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనెను వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. 


ఇలా తయారు చేసుకున్న నూనెను ఒక గిన్నెలోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఇందులో నువ్వుల నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె, మిరియాల పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి. అందులో ముందుగా తయారు చేసుకున్న నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు అంటేలా బాగా రాయాలి. తలకు నూనె రాసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఇలా నూనెను తయారు చేసుకుని వాడాలి.ఈ నూనెను జుట్టుకు రాసిన ఒకటి లేదా రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఉండి ఈ టిప్ ని ఖచ్చితంగా పాటించండి. తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: