జుట్టును బలంగా ఇంకా పొడవుగా పెంచే గుణం కలబందకి ఉంటుంది. కలబందతో ఈ టిప్ తయారు చేసుకొని పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే కలబందలో ఉండే ప్రోటీయో లైటిక్ ఎంజైమ్ లు మాడుపై ఉండే పాడైపోయిన కణాలను బాగు చేస్తాయి.ఇంకా అంతేకాకుండా జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి. అలాగే జుట్టు త్వరగా పెరిగేలా చేయడంలో కలబంద ఎంతగానో సహాయపడుతుంది. దీనికి ముందుగా కలబంద గుజ్జును తీసుకుని దానిపై ఉండే పచ్చసొనను నీటితో కడిగి వేయాలి.ఆ తరువాత ఈ గుజ్జును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా నీటిని పోసి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత దీనిలో ఒక టీ స్పూన్ ఉసిరి నూనెను వేసి కలపాలి. ఉసిరి నూనెను వాడటం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు రాలడం ఇంకా తలనొప్పి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.ఆ తరువాత ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ బాదం నూనెను వేసి బాగా కలపాలి.


బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఇంకా కాంతివంతంగా చేసే శక్తి కూడా ఈ బాదం నూనెకు ఉంది. ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ దూదితో కానీ జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత ఈ మిశ్రమం జుట్టులోకి బాగా ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఈ టిప్ తయారీలో వాడిన కలబంద గుజ్జు, ఉసిరి నూనె, బాదం నూనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇవి మన జుట్టుకు మంచి పోషణను అందించి జుట్టు బలంగా , అందంగా తయారు చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించిన రెండు గంటల తరువాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి ఒక టిప్ పాటించడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ టిప్ పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. చుండ్రు సమస్య నుండి  కూడా విముక్తి కలుగుతుంది.ఇంకా జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: