ఊడిన జుట్టు మళ్ళీ పెరగాలంటే ఇలా చెయ్యండి?

జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒకటి. ఈ సోయాబీన్స్ ను 12గంటల పాటు నానబెట్టి మనం ప్రతి రోజూ తయారు చేసే వంటల్లో వేసి తీసుకోవచ్చు. ఇంకా అలాగే మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. తగిన ప్రోటీన్స్ అందడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా మోలుస్తుంది.మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సోయా బీన్స్ ను తినలేని వారు ఈ మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా మనకు లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. 


ఈ విధంగా ప్రతిరోజూ కూడా తలస్నానం చేస్తూ, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు బాగా పొడవుగా ఇంకా ఒత్తుగా పెరుగుతుంది.జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు కూడా ఒకటి.చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాగే పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ చాలా మంది పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు ఎక్కువగా రాలుతుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే చుండ్రు సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. తలస్నానం చేసేటప్పుడు మన వేళ్లతో మాడును బాగా రుద్ది మసాజ్ చెయ్యాలి. ఇంకా అలాగే ప్రతిరోజూ కూడా తలస్నానం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: