ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని దానిని ముక్కలుగా చేసుకోని ఆ తరువాత జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 50 గ్రాముల ఆవ నూనెను తీసుకోవాలి. ఆవ నూనెనుకు బదులుగా కొబ్బరి నూనెను కూడా మనం వాడవచ్చు. ఆవ నూనె సరిపడని వారు కొబ్బరి నూనెను వాడాలి. ఈ నూనెను చిన్న మంటపై గోరు వెచ్చగా అయ్యే దాకా వేడి చేయాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి కలుపుతూ బాగా వేడి చేయాలి. దీనిని కనీసం 15 నుండి 20 నిమిషాల దాకా ఇలా కలుపుతూ వేడి చేయాలి.ఉల్లిపాయను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.ఇంకా జుట్టు ధృడంగా పెరుగుతుంది. జుట్టుకు కావల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉల్లిపాయలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.ఇక ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు  ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా వేడి చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూతను ఉంచి ఒక రాత్రంతా కూడా అలాగే ఉంచాలి.ఆ తరువాత ఒక జల్లిగంటె లేదా కాటన్ వస్త్రంని నూనెతో వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి.


బయట ఎక్కువ ధరలకు నూనెలను కొనుగోలు చేసి వాడే బదులుగా ఇలా ఇంట్లోనే ఉల్లిపాయతో నూనెను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. కొంతమందికి ఉల్లిపాయ వాసన నచ్చదు. ఇక అలాంటి వారు ఇందులో 2 లేదా 3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కలిపి వాడవచ్చు. దీంతో నూనె ఉల్లిపాయ వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ నూనెను వారానికి సరిపడా ఒకేసారి తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.ఇక తరువాత ఈ గిన్నెను నూనె గోరు వెచ్చగా అయ్యే దాకా వేడి నీటిలో ఉంచాలి. నూనె వేడయ్యాక దీనిని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.తరువాత నూనె బాగా ఇంకేలా సాఫ్ట్ గా మర్దనా చేసుకోవాలి. ఈ నూనెను రాత్రంతా కూడా జుట్టుకు అలాగే ఉంచి పొద్దున్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన అన్ని  సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యంగా , ఒత్తుగా ఇంకా అలాగే ధృడంగా పెరుగుతుంది. ఈ టిప్ ని పాటిస్తూనే చక్కటి పోషకాహారాన్ని కూడా తీసుకోవాలి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: