ఇక చలికాలంలో చర్మ సమస్యలు ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. చలికి చర్మం పొడిబారిపోవడంతో పాటు మరికొన్ని స్కిన్ ప్రొబ్లమ్స్ కూడా బాగా ఇబ్బంది పెడతాయి.ఈ చలికాలం చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.చలితో చర్మం బాగా పొడి బారుతుంది. దానిని నివారించాలనుకుంటే ఖచ్చితంగా గులాబీ రేకులను వాడాలి. ఎందుకంటే ఈ గులాబీ రేకులు చర్మాన్ని మెరిసేలా చేసి ఆరోగ్యంగా ఉంచుంతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో చర్మం ఎప్పుడు కూడా తాజాగా ఉంటుంది. రోజ్ వాటర్ లేదా పాలలో గులాబీ రేకులను మిక్స్ చేసి ఈ పేస్ట్ తయారు చేయాలి.ఒక టీస్పూన్ పేస్ట్‌లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి బాగా పట్టించి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా అలాగే నారింజ తొక్కలను పొడిగా చేయాలి.


ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ఆరెంజ్ పౌడర్, 2 టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్ ఇంకా అలాగే 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖం ఇంకా అలాగే మెడపై బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మ సంబంధిత సమస్యల నుంచి ఈజీగా మీకు కొంత ఉపశమనం పొందవచ్చు.ఇక తాజా చర్మం కోసం రెండు టీస్పూన్ల గులాబీ రేకుల పేస్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ చందనం పొడి ఇంకా అలాగే 1 చిటికెడు పసుపు కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖం ఇంకా అలాగే మెడపై అప్లై చేసి ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 3 రోజులు ఇలా చేస్తే చర్మం ఎప్పుడు కూడా చాలా తాజాగా ఉంటుంది.పురుషులు ఇంకా మహిళలు కూడా మొటిమల వల్ల ఇబ్బంది పడతారు. మొటిమల నుంచి ఈజీగా రక్షణ పొందేందుకు గులాబీలతో చేసిన ఫేస్ ప్యాక్ ఈజీగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు పెరగకుండా నిరోధిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: