మన చర్మ సంరక్షణకు వాడే పదార్ధాలలో కుంకుమ పువ్వు మంచి ప్రాచుర్యం పొందిన పదార్ధం. ఈ కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ లో కూడా ఎక్కువగా వాడతారు. ఈ కుంకుమ పువ్వు అనేది ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము కూడా. ఈ ప్రపంచంలోనే అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది ఇంకా అలాగే అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. ఈ కుంకుమపువ్వు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది.కుంకుమపువ్వుతో చర్మానికి చాలా రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇక కుంకుమపువ్వును పచ్చి పాలలో కొంత సమయం పాటు నానబెట్టండి. ఇది చర్మానికి మంచి సహజమైన క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. ఇక ఈ కుంకుమపువ్వు పాలలో దూదిని ముంచి, దానితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. కుంకుమపువ్వును గంధం ఇంకా అలాగే రోజ్‌వాటర్ కలిపి ముఖానికి వేసుకుంటే ఖచ్చితంగా సహజమైన మెరుపు వస్తుంది.
ఒక చెంచా చందనం పొడిలో 4 నుంచి 5 దారాల కుంకుమపువ్వుని వేసి కలపాలి. ఈ రోజ్ వాటర్ ని ఉపయోగించి మందపాటి పేస్ట్ ని చేసుకోవాలి. దాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోండి.ఇక చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కుంకుమపువ్వును కూడా వాడవచ్చు. బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనెతో కలిపిన కుంకుమపువ్వును బాడీ స్క్రబ్‌గా వాడండి. మీ చర్మం నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి మీ చేతులతో ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సాఫ్ట్ గా మసాజ్ చేయండి. చర్మాన్ని హైడ్రేట్ గా ఇంకా అలాగే తాజాగా ఉంచడానికి మీరు దీన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. సువాసనగల ఈ టోనర్‌ను తయారు చేయడానికి కొన్ని కుంకుమపువ్వును రోజ్ వాటర్‌లో బాగా నానబెట్టాలి. ఇక దీన్ని బాగా కలిపిన తర్వాత.. దానిని స్ప్రే బాటిల్‌లో వేసి ముఖంపై అలా స్ప్రే చేయాలి.అప్పుడు ఖచ్చితంగా ముఖం నిగ నిగ లాడుతూ ఫ్రెష్ గా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: