మన ఫేస్ పై ఎలాంటి మచ్చ, మొటిమ లేకుండా అందంగా కాంతివంతంగా తళతలా మెరిసిపోవాలని దాదాపు అందరూ కూడా కోరుకుంటారు. కానీ అలాంటి అందమైన ముఖాన్ని పొందడం సాధ్యం కాదని కూడా భావిస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఫేస్ ప్యాక్ అయితే చాలా అద్భుతంగా సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను మీరు వేసుకుంటే మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు.ఇక ఆ ఫేస్ ప్యాక్ ఏంటి?దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు స్టవ్ ని ఆన్ చేసి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ని పోయాలి. ఇక ఆ నీళ్లు వేడి కాగానే అందులో గుప్పెడు ఫ్రెష్ వేపాకులను వేసి వాటిని ఉడికించాలి. ఆ నీళ్లు సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో వాటిని ఫిల్టర్ చేసుకోవాలి.


అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేపాకుల పొడి ఇంకా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.ఆ తరువాత సరిపడా వేపాకుల నీటిని వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ తో ముఖానికి ఇంకా అలాగే మెడకు అప్లై చేసుకుని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తరువాత నీళ్లతో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను మీరు చర్మానికి రాసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను మీరు అప్లై చేస్తే చర్మం పై మొటిమలు ఇంకా మొండి మచ్చలు క్రమంగా దూరం అవుతాయి. పిగ్మెంటేషన్ ప్రాబ్లెమ్ నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. దాంతో మంచి అందమైన స్కిన్ మీ సొంతం అవుతుంది. కాబట్టి, తప్పకుండా ఈ టిప్ ని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: