మన జుట్టుకు ఎలాంటి హాని కలగకుండా అందంగా, ధృడంగా జుట్టును ఉంచుకోవడానికి కొన్ని న్యాచురల్ టిప్స్ ఉన్నాయి. కొన్ని న్యాచురల్ పదార్ధాలను మనం వాడే షాంపులో కలపడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని కలగదు.అంతేకాకుండా జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, జుట్టు చిట్లడం ఇంకా అలాగే చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టును ఆకర్షణీయంగా ఇంకా అందంగా మార్చే ఈ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందు కోసం ముందుగా ఒక గిన్నెలో మన జుట్టుకు తగినంత షాంపును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర టీ స్పూన్ టీ పౌడర్ ను వేసి కలపాలి. తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయల పొడిని కూడా వేసి కలపాలి.చివరగా ఇందులో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి  బాగా కలిసేలా కలపాలి. ఇలా తయారు చేసుకున్న షాంపుతో జుట్టుకి పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తరువాత దీనిని జుట్టుపై ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.


5 నిమిషాల తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా తయారు చేసుకున్న షాంపును జుట్టుపై కేవలం ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు.ఇలా రెడీ చేసుకున్న షాంపును ఉపయోగించిన తరువాత ఎటువంటి ఇతర షాంపును వాడాల్సిన అవసరం ఉండదు. తలస్నానం చేసిన ప్రతిసారి ఇలా షాంపును తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల మన జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది.ఇంకా అలాగే ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం, జుట్టు తెగడం ఇంకా అలాగే చుండ్రు వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ న్యాచురల్ టిప్ ని పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా అంతేకాకుండా జుట్టుకు ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: