ఇక చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్ లు చాలా మంటను, దురదను, బాధను, నొప్పిని కలిగిస్తాయి. చర్మానికి గాలి తగలకుండా బిగుతైన దుస్తులను ధరించడం, చెమట ఎక్కువగా పట్టడం, చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దుమ్ము, వాతావరణ కాలుష్యం, పెంపుడు జంతువుల నుండి వచ్చే ధూళి ఇంకా అలాగే అలర్జీలను కలిగించే వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం ఇంకా మందులు వాడడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి.చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్ లను దూరం చేసే టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను, గుప్పెడు వేపాకును ఇంకా అలాగే 2 ఇంచుల కలబంద కాడను తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వేపాకును బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా దాన్ని ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో మీరు వేపాకును వేసుకోవాలి. అలాగే తరువాత కలబంద కాడను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను చిన్న మంటపై మీరు వేడి చేయాలి. వేపాకులు చక్కగా వేగి కరకరలాడే దాకా ఈ నూనెను వేడి చేసి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.


ఇక ఆ నూనె చల్లారిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. తరువాత మనకు కావల్సిన పరిమాణంలో ఈ నూనెను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత కర్పూరం కరిగే దాకా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఎలర్జీ సమస్య ఉన్న చోట చర్మానికి రాసుకోవాలి. తరువాత ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై వచ్చే ఇన్పెక్షన్ లు, దురదలు ఇంకా అలాగే దద్దుర్లు ఈజీగా తగ్గుతాయి. ఇంకా చర్మం మెత్తబడి మృదువుగా తయారవుతుంది. వేపాకు, కలబందలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే వాటితో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: