మన జుట్టు సమస్యలు తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులను ఇంకా అలాగే హెయిర్ డైలను వాడడం వంటి వివిధ కారణాల చేత జుట్టు సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.అయితే ఈ చక్కటి చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా మీరు జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.ఈ చిట్కా  వల్ల జుట్టు ఒత్తుగా అలాగే పొడవుగా పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ టిప్ ఏమిటి.. ఇక దీనిని ఎలా తయారు చేసుకోవాలి..ఇంకా ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం మూడు టీ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోవాలి. ఆ తరువాత రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి కలపాలి. ఇ


లా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఆ తరువాత 5 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి.ఆ తరువాత జుట్టుకు హెయిర్ క్యాప్ ను పెట్టుకుని దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచాలి.తరువాత ఉదయాన్నే రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా ఆయుర్వేద షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ అంది జుట్టు కుదుళ్లు చాలా బలంగా, ధృడంగా తయారవుతాయి. చుండ్రు సమస్యతో పాటు తలలో దురదలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే జుట్టు కాంతివంతంగా, మృదువుగా కూడా తయారవుతుంది. అలాగే జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: