జుట్టు రాలే సమస్యని శాశ్వతంగా తగ్గించే చిట్కా ?

చాలా మంది కూడా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల షాంపూలు ఇంకా కండీషనర్లు వినియోగిస్తుంటారు. కానీ ఇది అసలు మంచి పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా హెయిర్‌ఫాల్ సమస్య ప్రారంభమైందంటే ఆ సమస్య అంత ఈజీగా పోదు. ఇక మీరు కూడా సమస్య వల్ల ఇబ్బంది పడుతుంటే వెల్లుల్లి సహాయం తీసుకోని ఈ సమస్యని పోగొట్టొచ్చు. హెయిర్‌ఫాల్ సమస్యను అరికట్టేందుకు వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వెల్లుల్లి జుట్టుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. 2 వెల్లుల్లి రెమ్మల్ని ఇంకా ఉల్లిపాయల్ని తీసుకుని నీళ్లలో కాస్సేపు ఉడికించాలి. అవి చల్లారిన తరువాత ఆ నీళ్లతో జుట్టుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ తో హెయిర్‌ఫాల్ సమస్యను చాలా ఈజీగా అరికట్టవచ్చు.ఇంకా అలాగే వెల్లుల్లి అల్లం కలిపి రాయడం వల్ల కూడా హెయిర్‌ఫాల్ సమస్య నుంచి ఈజీగా విముక్తి పొందవచ్చు.


దీనికోసం అల్లం ముక్కలు ఇంకా 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకుని బాగా పేస్ట్ కింద చేసుకోవాలి.కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేసి ఆ తరువాత ఇందులో వెల్లుల్లి, అల్లం మిశ్రమాన్ని కలిపి జుట్టుకు రాసి తేలిగ్గా మస్సాజ్ చేయాలి.ఈ టిప్ ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలనిస్తుంది.ఇంకా అలాగే వెల్లుల్లి, తేనె సహాయంతో కూడా హెయిర్‌ఫాల్ సమస్యను చాలా ఈజీగా దూరం చేయవచ్చు. దీనికోసం 10 వెల్లుల్లి రెమ్మల్ని ఇంకా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి.ఆ వెల్లుల్లిని రుబ్బి అందులో తేనె కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా రాసుకోవాలి. ఒక 20 నిమిషాలు పాటు అలానే ఉంచాలి.ఇక ఆ తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రంగా తల శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్‌ఫాల్ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: