ముఖాన్ని తెల్లగా అందంగా మార్చే సూపర్ ఫేస్ ప్యాక్?

మనం వంటల్లో వాడే పుదీనాలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. పుదీనాను వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను మన దరి చేరుకుండా చేసుకోవచ్చు. ఇది కేవలం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనే కాదు మన అందాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. పుదీనాను వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపును ఇంకా ట్యాన్ ను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.ఇంకా అంతేకాకుండా పుదీనాను వాడడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే చర్మ సమస్యలు తగ్గి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. అయితే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పుదీనా మనకు ఏ విధంగా సహాయపడుతుంది.. దీనిని ఎలా వాడాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు తాజాగా ఉండే గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని వాటిని శుభ్రం కడగాలి. ఆ తరువాత వీటిని పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోని తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె ఇంకా ఒక టీ స్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 5 నిమిషాల పాటు సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి.ఇక ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా పుదీనాను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు, నలుపు ఇంకా మురికి అంతా ఈజీగా తొలగిపోయి చర్మం ఖచ్చితంగా చాలా అందంగా మారుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వారానికి రెండు సార్లు పాటించడం వల్ల ముఖం చాలా అందంగా ఇంకా కాంతివంతంగా మారుతుంది.ఇంకా అంతేకాకుండా చర్మ ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: