Beauty tips for healthy hair
మన తలలో చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు రాలడం ఇంకా చికాకు వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే యాంటీ డాండ్రఫ్ షాంపులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని వాడినా కూడా ఎటువంటి ఫలితం లేక మనలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే చుండ్రు సమస్యతో బాధపడే వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.ఇంకా ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి కోడిగుడ్డును, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసాన్ని వేసి కలపాలి.
తరువాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తల చర్మాన్ని అంటేలా బాగా పట్టించాలి. దీనిని అరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.ఈ టిప్ వాడటం చర్మానికి కావల్సిన తేమ లభించి చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంకా అలాగే చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఈ టిప్ ని వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంలో పాటు జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వారానికి ఒకసారి వాడడం వల్ల మనం చాలా సులభంగా చుండ్రు సమస్యను మనం తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చుండ్రు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.