ముఖంపై నలుపు,మంగు,మచ్చలు పోయే సింపుల్ టిప్?

పెద్దగా ఖర్చు ఏమి లేకుండా కేవలం మన ఇంట్లో దొరికే పదార్థాలతో స్క్రబర్ ని అలాగే ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ మచ్చలను నలుపుని ఇంకా మంగుని తొలగించుకోవచ్చు. ముఖంపై ఉండే మచ్చలను తొలగించే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి? ఇక అందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం పంచదారను, నిమ్మరసాన్ని ఇంకా పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పెరుగును మన ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ ఆరిన తరువాత నిమ్మచెక్కతో పంచదారను తీసుకుని ముఖంపై బాగా రుద్దుకోవాలి.అలాగే నిమ్మరసాన్ని పిండుతూ చర్మాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా రెండు నుండి మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకున్న తరువాత ముఖాన్ని చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.


ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం ముఖంపై ఉండే మచ్చలను మంగును నలుపును చాలా సులభంగా తొలగించుకోవచ్చు.ఇంకా అలాగే పిగ్మెంటేషన్ తగ్గించే మరో టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి గానూ ఒక స్పూన్ చందనం పొడిని, బంగాళాదుంప రసాన్ని ఇంకా చిటికెడు పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా గిన్నెలో చందనం పొడిని తీసుకోని ఆ తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. తరువాత తగినంత బంగాళాదుంప రసాన్ని పోస్తూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. అది ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మచ్చలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇలా ఈ చిట్కాలను వాడడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: