చర్మ సమస్యల నుంచి రక్షణకు వివిధ రకాల స్కిన్ క్రీములు ఉన్నా ఆయుర్వేద చిట్కాలు బాగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల దొరికే వాటితోనే ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చని పేర్కొంటున్నారు. ఎండ వేడిమి వల్ల వచ్చే దద్దుర్ల సమస్య నుంచి రక్షణకు ఆయుర్వేద నిపుణులు సూచించే ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కలబంద చర్మం, జుట్టుకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన చర్మ సంరక్షణలో కలబంద గుజ్జును ఉపయోగించడం వల్ల ఇది శరీరాన్ని ఖచ్చితంగా చల్లగా ఉంచుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కలబందను లేపనంగా రాసుకుంటే చాలా మంచిదని వివరిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల వచ్చే వేడి దద్దుర్లపై కలబంద రాసుకుంటే ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది.అలాగే ముల్తానీ మిట్టిలో అనాల్జేసిక్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వేడి దద్దుర్లు నుంచి తక్షణమే చర్మాన్ని ఈజీగా ఉపశమనం చేస్తాయి.


అర టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి ప్రభావిత భాగానికి అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే పిప్పరమింట్ ఆయిల్ బర్నింగ్ అనుభూతులను ఈజీగా నయం చేస్తుంది. అలాగే చర్మంపై వచ్చే వేడి దద్దుర్లని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇది ప్రభావిత ప్రాంతానికి క్రీమ్, నూనె ఇంకా స్ప్రే లేదా క్రీమ్‌గా ఉపయోగించవచ్చు.అలాగే కొబ్బరి నూనె వడదెబ్బ లేదా వేడి దద్దుర్లు విషయంలో చర్మాన్ని ఖచ్చితంగా శాంతపరుస్తుంది. ఇది చర్మంని రిలీఫ్ చేయడంతో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో వేడి దద్దుర్ల లక్షణాలను సమతుల్యం చేస్తుంది.అలాగే తాజా దోసకాయ రసం వేసవిలో చర్మాన్ని బాగా మృదువుగా చేయడానికి చాలా సహాయపడుతుంది. నిజానికి నిపుణులు దోసకాయ రసాన్ని వేసవిలో చర్మంపై అప్లై చేయడం ద్వారా చర్మం తేమగా ఇంకా చల్లగా ఉంచడంలో సాయం చేస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: