డార్క్ సర్కిల్స్ అనేవి బాగా వేధించే సమస్యల్లో ఒకటి.ముఖ్యంగా కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, ఆహారపు అలవాట్లు ఇంకా అలాగే శరీరంలో అధిక వేడి వంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి.అయితే ఇవి చూసేందుకు కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అంతేగాక మన అందాన్ని కూడా పాడు చేస్తాయి. అందుకే డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఇక మీరు ఈ లిస్టులో ఉన్నారా..? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ తో డార్క్ సర్కిల్స్ కు ఈజీగా చెక్ పెట్టండి.ఫస్ట్ ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ని వేసుకోవాలి. ఇంకా అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ విటమిన్ఆయిల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ ను రాత్రి నిద్రించే ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను అప్లై చేసుకుంటే నల్లటి వలయాలు ఈజీగా తగ్గుతాయి.


ఇంకా అలాగే డార్క్ సర్కిల్స్ సమస్యను వదిలించడానికి జాజికాయ కూడా చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మీరు ఒక జాజికాయను తీసుకొని ఏదైనా రాతిపై వాటర్ సహాయంతో దాన్ని బాగా రబ్ చేయాలి. అలా వచ్చిన స్మూత్ పేస్ట్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాత వాటర్ తో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేసినా కానీ నల్లటి వలయాలు ఈజీగా మాయం అవుతాయి.అలాగే మరొక విధంగా కూడా డార్క్ సర్కిల్స్ ను మనం ఈజీగా వదిలించుకోవచ్చు. అందుకోసం ఒక బౌల్ ని తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మజ్జిగని వేసుకోవాలి. ఇంకా అలాగే చిటికెడు పసుపుని వేసి బాగా కలపాలి. అలాగే ఇప్పుడు ఇందులో కాటన్ ప్యాడ్స్ ను నానబెట్టి ఆ తరువాత వాటిని కళ్ళపై పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత వాటిని తొలగించి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేసినా కూడా డార్క్ సర్కిల్స్ చాలా ఫాస్ట్ గా మాయం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: