ఈ కాలంలో మారిన కాలంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు చాలా ప్రధానమైనవని చెప్పుకోవాలి.మనం నిత్యం ఉపయోగించే కెమికల్ కాస్మటిక్స్ ఇంకా వాతావరణ పరిస్థితులు చర్మ సంరక్షణకు చాలా పెద్ద సవాలుగా మారాయి.అయితే రసాయనాలతో చేసిన ఉత్పత్తుల కంటే సహజమైన పద్ధతులతోనే చర్మ సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని డెర్మాటలజిస్టులు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే కొబ్బరినూనె, పాలు, నెయ్యి వంటి ప్రకృతి వర ప్రసాదాలు చర్మ సంరక్షణ కాపాడడంలో చాలా బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నెయ్యిలోని సహాజ లక్షణాలు చర్మాన్ని చాలా కాంతివంతంగా చేయడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను కూడా ఈజీగా నిరోధిస్తాయి. ఇందులో ఉండే ఏ, డీ, ఈ విటమిన్లు ఇంకా యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.చాలా మందికి కూడా నిద్రలేమి కారణంగా కంటి మీద ఏర్పడే డార్క్ సర్కిల్స్ చాలా పెద్ద సమస్యగా మారాయి.


అలాగే ఇవి చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి.అయితే డార్క్ సర్కిల్స్ మీద నెయ్యిని అప్లై చెయ్యడం వల్ల అక్కడి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. ఇంకా అంతే కాకుండా మీ ముఖం రిలాక్సింగ్ అనుభూతిని పొందుతుంది. ఇలా వారం రోజుల పాటు నెయ్యిని వాడితే డార్క్ సర్కిల్స్ చాలా ఈజీగా మాయమవుతాయి.నెయ్యితో పొడి, పగిలిన పెదవులకు కూడా చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం మీరు పగిలిన పెదాలను నెయ్యితో కనుక రుద్దితే చాలు.. మీ పెదవులు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తాయి.ఇంకా నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్‌ ఉన్నందు వలన ఇది మంచి నేచరల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.ఇంకా అలాగే చర్మాన్ని ఎక్కువ సమయం పాటు తేమగా ఉంచి, పొడి చర్మాన్ని కూడా ఈజీగా నిరోధిస్తుంది. ఇందు కోసం మీరు స్నానం చేసే ముందు నెయ్యితో మీ చర్మంపై సున్నితంగా మసాజ్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: