జుట్టు రాలే సమస్యతో మనలో చాలా మంది కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం ఇంకా జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి చాలా కారణాల వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలా మంది దీని వల్ల ఖచ్చితంగా మరింత ఒత్తిడికి గురి అవుతున్నారని చెప్పవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందరు.అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే ఉల్లిపాయతో జుట్టు రాలడాన్ని చాలా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో ఉల్లిపాయ మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఉండే కాఫిరాల్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది.ఈ రసాయన సమ్మేళనం జుట్టు కుదుళ్లల్లో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి జుట్టుకు ఎక్కువగా రక్తప్రసరణ జరిగేలా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీంతో రక్తంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు చాలా బాగా అందుతాయి. పోషకాలు అందడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా అదే విధంగా జుట్టు పెరుగుదలకు సల్ఫర్ అనేది చాలా అవసరం.


జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఈ సల్ఫర్ ఉల్లిపాయలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా కూడా వెల్లడించారు. మన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడే ఈ ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇందుకోసం ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి దానిని జార్ లో వేసుకోవాలి.ఆ తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి చిక్కటి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తలకు బాగా పట్టించి తరువాత 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వారు ఈ టిప్ ని పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: