అందమైన మెరిసే చర్మం కోసం చాలా మంది యువతి యువకులు తెగ ఆరాటపడుతుంటారు.ఇక ఆడవాళ్లు అయితే నెలకు కనీసం రెండు సార్లు అయినా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఖచ్చితంగా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.అయితే ఇలా తరచూ ఫేషియల్ చేయించుకోవడం వల్ల స్కిన్ చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కానీ చర్మ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా పాడవుతుంది. అందుకే సహజంగానే అందంగా మెరిసేందుకు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ రెమెడీ పాటిస్తే అసలు ఏ ఫేషియల్ కూడా పనికిరాదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక బంగాళదుంపను తీసుకుని దాని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తరువాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను మీరు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ ఇంకా చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.


ఇప్పుడు ఇందులో రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ తో పాటు అందుకు సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ బాగా కలిసేంత వరకు వాటిని మిక్స్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా మెడకు ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత చర్మాన్ని వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని  ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఫేషియల్ గ్లో మీ సొంతం అవుతుంది.అలాగే మీ స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.అలాగే చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా తొలగిపోతాయి. ఇంకా చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది. కాబట్టి ఇకపై గ్లోయింగ్ స్కిన్ కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్స్ చేయించుకోవడం మానేసి.. ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీని పాటించండి. ఖచ్చితంగా మెరిసిపోయే అందం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: