చాలా మందికి కూడా వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ నోటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజుకు రెండు పూటలా టూత్ పేస్ట్ తో  శుభ్రం చేసుకున్నప్పటికి ఎలాంటి ఫలితం లేదు. ఇంకా మార్కెట్ లో దొరికే వివిధ రకాల టూత్ పేస్ట్ లకు వాడినప్పటికి ఈ సమస్యలు ఏ మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే ఈ నోటి ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల, పంచదార కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఇంకా శీతల పానీయాలను తాగడం వల్ల నోటి ఆరోగ్యం అనేది బాగా దెబ్బతింటుంది.ఇవి తిన్న తరువాత నోటిని శుభ్రం చేసుకున్నప్పటికి మన రుచిగులికల్లో పంచదార అనేది ఉంటుంది. ఇలా నోట్లో ఉండే పంచదార కారణంగా నోట్లో చెడు బ్యాక్టీరియా శాతం బాగా పెరుగుతుంది. అందువల్ల దంతాలు పుచ్చిపోవడం, గార పట్టడం ఇంకా నాలుకపై పాచి ఎక్కువగా పేరుకుపోవడం అలాగే దంతాలు పుచ్చిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంది.


మన నోటి ఆరోగ్యం మెరుగుపడాలంటే ఖచ్చితంగా జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మనం పంచదార ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఒక చక్కటి టిప్ ని పాటించాలి. ఈ టిప్ ని పాటించడం వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. ఈ టిప్ ని వాడడం చాలా సులభం.ఇందుకోసం రోజూ రాత్రి పడుకునే ముందు నోట్లో రెండు టీ స్పూన్ల తేనెను మీరు వేసుకోవాలి. ఈ తేనెను అన్ని దంతాలకు ఇంకా చిగుళ్లకు తగిలేలా చప్పరించాలి. నోట్లో నీళ్లు పోసి పుక్కిలించకుండా ఈ తేనెను నోట్లో అలాగే ఉంచుకుని మీరు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.అలాగే నాలుకపై పాచి పేరుకుపోవడం తగ్గుతుంది. ఇంకా తేనె మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుంది. ఇది నోట్లో ఉండే బ్యాక్టీరియాలను  నశింపజేస్తుంది.అందువల్ల నోట్లో బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. ఇంకా నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా తేనెను వాడటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: