ఇప్పుడున్న వాతావరణంలో ని పొల్యూషన్, మనకున్న ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు పెరగడమే కాకుండా మన చర్మ ఆరోగ్యం కూడా ఎంతో దెబ్బతింటూ వుంటుంది.దీని కారణంగా ముఖముపై మొటిమలు,మచ్చలు,మృత కణాలు, వృద్ధాప్య ఛాయలు అధికమవుతూ ఉన్నాయి. వీటన్నిటినీ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన ఫలితం లేక కూడా ,చాలామంది ఇబ్బంది ఫీలవుతూ ఉంటారు.అలాంటి వారికి అవకాడో ఆయిల్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.అలాంటి ఆయిల్ తో కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

అవకాడో ఆయిల్లో విటమిన్ ఈ, డి, ఏ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా సిక్స్ ఆసిడ్స్ మొదలగు పోషకాలెన్నో పుష్కలంగా లభిస్తాయి.ఇవి చర్మం సంరక్షణ కోసం చాలా బాగా ఉపయోగపడి,అందంగా తయారు చేస్తుంది.

ముఖం మాయిశ్చరైజింగ్ గా ఉండడానికి..

అవకాడో ఆయిల్ తో తరచూ ముఖాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల,ఇందులో ఉన్న పొటాషియం మరియు లేసిథిన్ చర్మానికి తేమనందించడానికి ఉపయోగపడతాయి.దీనితో ముఖం పైన చర్మం ఎల్లప్పుడూ మాయిశ్చరైజింగ్ ఉంటుంది.ఈ అయిల్ పొడి చర్మం కలవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మొటిమలు..

అధికంగా మొటిమలతో బాధపడేవారు అవకాడో ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల,అవకాడో అయిల్ లోని,యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

ఎండ నుంచి సంరక్షణ..

తరచూ ఎండకు వెళ్లేవారు టాన్ అయిపోకుండా అవకాడో అయిల్ ని అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఇందులోని బీటా కెరోటిన్ మరియు లైసోతిన్,ప్రోటీన్లు ఎండ నుంచి మరియు యూవీ కిరణాల నుంచి చర్మం పాడవకుండా సంరక్షిస్తాయి.

వృద్ధాప్య ఛాయలు రాకుండా..

కొంతమందికి చిన్న వయసులోనే మొహముపై ముడతలు కలిగి,వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.అలాంటివారికి అవకాడో ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని కోసం కొద్దిగా అవకాడో ఆయిల్ ని కొద్దిగా వేడి చేసి,గోరు వెచ్చగా ఉన్నప్పుడే ముఖానికి మసాజ్ చేసుకోవాలి.దీనితో ఇందులోని విటమిన్ ఏ మరియు డి క్రమంగా వృద్ధాప్య ఛాయలు తొలగించేందుకు ఉపయోగపడతాయి.దీనితో అందం మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: