బ్యూటీ టిప్స్ అనేవి చాలా మంది ఇస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి బ్యూటీ టిప్స్ ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లు చాలా మందే ఉంటారు.అయితే ఈ టిప్స్ కొంత వరకు పని చేసినా కూడా ప్రతి ఒక్కరికీ పని చేస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు.ఎందుకంటే ఒక్కొక్కరి చర్మ తత్వం అనేది ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరి చర్మ రకం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. అందుకే ఒకరి టిప్స్ మరొకరికి పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు సమస్య ఏమిటో తెలుసుకుని డాక్టర్ ని సంప్రదించి ఎవరి చర్మానికి సరిపోయే చిట్కాలు వారే తయారు చేసుకోవడం ఉత్తమం.మొటిమలు అంటే ఎంత చిరాకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ముఖంపై మొటిమలు వస్తే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కొందరేమో వాటిని నలిపేసి వాటి నుంచి చీము బయటకు తీస్తుంటారు. కానీ ఇలా చేయడం అసలు ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.


ఎందుకంటే ఈ మొటిమలని చిదిమేయడం వల్ల ఇన్ఫెక్షన్లకు, మరిన్ని మొటిమలకు కూడా దారితీయవచ్చు. అందుకే ఇలా చేయకుండా వైద్యులు సూచించే క్రీములు, జెల్స్ వాడటం మంచి పద్ధతి. ఇంకా అలాగే తరచూ మంచి నీటితో ముఖాన్ని కడుగుతూ ఉండటం వల్ల మొటిమలను ఈజీగా నియంత్రించవచ్చు.అదిరిపోయే బ్యూటీ కోసం చాలా రకాల క్రీములు, జెల్ లు వాడుతుంటారు. కానీ సన్‌స్క్రీన్ కొనడానికి మాత్రం అసలు మనసు రాదు. ఎండ నుండి, సూర్యకిరణాల నుండి చర్మాన్ని సన్‌స్క్రీన్ రక్షిస్తుంది.ఆ సూర్య కిరణాల వల్ల చర్మం అందం కోల్పోతుంది. ఎండ వేడిమికి చర్మం బాగా పొడిబారుతుంది.అంతేగాక దీని వల్ల ఇతర సమస్యలు కూడా రావొచ్చు. అలాగే ఎక్కువ సేపు ఎండకు బహిర్గతం కావడం వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇంట్లో నుండి బయటకు వెళ్తే తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా మంచిది.కాబట్టి ఈ విషయాలు గుర్తు పెట్టుకొని చర్మ సంరక్షణలో భాగంగా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ లాంగ్ ఎలాంటి చర్మ సమస్యలు మీ దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: