బెల్లి ఫ్యాట్ వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది.అందుకే ఈ సమస్య నుండి చాలా త్వరగా బయటపడాలి. ఈ సమస్య తగ్గడానికి చాలా మంది కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, డైటింగ్ పద్దతులను పాటించడం, వాకింగ్ ఇంకా జాజింగ్ ఇలా ఎన్నో రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.అయితే వీటితో పాటు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా చాలా ఈజీగా పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక బరువు తగ్గించే ఈ జ్యూస్ ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా అలాగే దీనిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక బెల్లి ఫ్యాట్ ని తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి  ముందుగా మనం సొరకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. సగం సొరకాయ ముక్కను తీసుకుని తరువాత దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేడి నీటిలో వేసుకోవాలి.ఇక ఇదే నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క,2 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి.ఆ తరువాత ఈ ముక్కలను వడకట్టి అవి చల్లారిన తరువాత జార్ లో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ జ్యూస్ లో కొద్దిగా సైంధవ లవణంతో పాటు కొద్దిగా త్రికట చూర్ణంని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఈ త్రికట చూర్ణం మనకు మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ఇక ఈ చూర్ణాన్ని శొంఠి, పిప్పిళ్లు ఇంకా మిరియాలు కలిపి తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి.అయితే పరగడుపున వీలు కాని వారు బ్రేక్ ఫాస్ట్ చేసిన రెండు గంటల తరువాత తాగాలి. ఈ విధంగా సొరకాయతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: