ఈ రోజుల్లో చాలా కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి.డార్క్ సర్కిల్స్ సమస్య ఖచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే కేవలం స్ట్రెస్‌, నిద్రలేమి, స్క్రీన్ చూడటం వల్ల మాత్రమే కాకుండా శరీరంలో పోషకాహార లోపం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయి.ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు కంటి చుట్టూ కేవలం క్రీమ్ వాడటం వల్ల మాత్రమే నల్లటి వలయాలు పెరగకుండా నిరోధించలేం. అయితే అందుకు ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. పోషకాహార లోపం వల్ల కూడా నల్లటి వలయాలు ఎక్కువగా పెరుగుతాయి. కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడంలో విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ కెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మంపై మచ్చలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది.అందుకే పచ్చి కూరగాయలు ఎక్కువగా తినాలి.అలాగే శరీరంలో ఐరన్ లోపం ఉన్నా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయంటున్నారు ఆరోగ్య నిపుణుల. ఈ ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.మన కణాలకు ఆక్సిజన్‌ను అందించి.. కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది. పప్పులు, బెల్లం, వివిధ కూరగాయలు ఇంకా పండ్లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది.అలాగే విటమిన్ ఎ అనేది చర్మంపై యాంటీ ఏజింగ్ ఇంగ్రిడియంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.


ఇంకా అలాగే ముడతలు, చర్మ అలర్జీలను నివారించడానికి కూడా పనిచేస్తుంది. విటమిన్ ఎ కంటి చుట్టూ నల్లటి వలయాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో ఎరుపు-పసుపు-ఆకుపచ్చ క్యాప్సికమ్, బొప్పాయి, పాలకూర వంటి కూరగాయలు ఇంకా పండ్లను అధికంగా తీసుకోవాలి.అలాగే చర్మ సంరక్షణ కోసం విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినడం చాలా అవసరం. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది చర్మానికి మంచి రక్త ప్రసరణను పెంచి.. కణాలకు ఆక్సిజన్ సరఫరాను కూడా అందిస్తుంది.కాబట్టి మీ రోజువారీ ఆహారంలో నిమ్మ, ఉసిరి ఇంకా బెర్రీలు మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.మన చర్మ సంరక్షణలో విటమిన్ ఇ కూడా చాలా అవసరం. ఇది చర్మంపై ముడతలు ఇంకా కళ్ల చుట్టూ ఉబ్బినట్లు ఉండటాన్ని నివారిస్తుంది. విటమిన్ ఇ లోని యాంటీఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్‌ ఇ అధికంగా ఉండే వాల్ నట్స్, చియా సీడ్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ మొదలైన వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: