జుట్టు సమస్యలని తగ్గించే మూలికలు ఇవే?

నేటి కాలంలో జుట్టు సమస్యలతో బాధపడే వారు చాలా ఎక్కువవుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పలుచబడడం, జుట్టు పెరగకపోవడం, చుండ్రు ఇంకా తలలో దురద వంటి వాటిని జుట్టు సమస్యలుగా చెప్పవచ్చు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే హెయిర్ ప్రొడక్ట్స్ ను ఇంకా షాంపులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల ఎలాంటి ఫలితం లేకపోగా వీటిలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు సమస్యలు మరింత ఎక్కువవుతాయి.ఇలా రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడానికి బదులుగా సహజ సిద్దమైన కొన్ని మూలికలను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ ఈజీగా దూరమవుతాయి.ఈ మూలికలను వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. 


వీటిని జుట్టు సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక జుట్టు సమస్యలను దూరం చేసి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద మూలికలు ఏమిటి.. ఇంకా వీటిని వాడడం వల్ల మన జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలలో మనకు బ్రహ్మి చాలా బాగా సహయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఆల్కలాయిడ్స్ జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.బ్రహ్మిని వాడడం వల్ల జుట్టు పొడవుగా ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. ఇక జుట్టు సంరక్షణలో ఉసిరికాయ కూడా బాగా సహాయపడుతుంది. మన ఆయుర్వేదంలో కూడా ఉసిరిని జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.ఉసిరికాయను వాడడం వల్ల చుండ్రు సమస్య ఈజీగా తగ్గడంతో పాటు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో కూడా సహాయపడతాయి.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టుకి సంబంధించిన సమస్యలని చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: