చాలా మంది కూడా తరుచూ జిడ్డు చర్మం సమస్యతో  బాధపడుతూ ఉంటారు. ఈ జిడ్డు చర్మం కారణంగా మొటిమలు, మచ్చలు ఇంకా బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.ఇంకా అలాగే చర్మంపై మురికి, దుమ్ము వంటివి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. జిడ్డు చర్మం కారణంగా ముఖం అందవిహీనంగా ఇంకా నీరసంగా కనిపిస్తుంది. చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి సబ్బులను, స్క్రబర్ లను, వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఖర్చు తప్ప ఎలాంటి ఫలితం ఉండదనే చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను వాడడం వల్ల మనం చాలా ఈజీగా చర్మంపై ఉండే జిడ్డును తొలగించుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవడం ఇంకా అలాగే వాడడం కూడా చాలా సులభం. చర్మంపై ఉండే జిడ్డును తొలగించే ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


జిడ్డు చర్మాన్ని అందంగా మార్చడంలో ఈ కోడిగుడ్డు తెల్లసొన  ఎంతగానో సహాయపడుతుంది. ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను వేసి నురుగా వచ్చే దాకా బాగా కలపాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసాన్ని కొన్ని చుక్కలు మోతాదులో వేసి కలపాలి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కళ్ల చుట్టూ ఇంకా కనుబొమ్మల చుట్టూ వదిలేసి ఈ మశ్రమాన్ని రాసుకోవాలి. దీనిని ఆరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఉండే జిడ్డు ఈజీగా తొలిగిపోతుంది. ఇంకా అలాగే ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ గంధం పొడి ఇంకా అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అదే విధంగా ఒక గిన్నెలో వంటసోడాను తీసుకుని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని ఒక నిమిషం పాటు అలాగే మర్దనా చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డుతో పాటు మొటిమల సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇక జిడ్డు చర్మాన్ని అందంగా మార్చడంలో కలబంద గుజ్జు కూడా మనకు సహాయపడుతుంది. ముందుగా ఒక గిన్నెలో కలబంద గుజ్జును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసం, టమాట గుజ్జు వేసి కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: