జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని మనం చాలా రకాల సంరక్షణ చర్యలను చేపడుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యం కోసం మనం తీసుకునే సంరక్షణ చర్యలల్లో జుట్టుకు నూనె రాసుకోవడం ఒకటి.మన జుట్టుకు నూనె రాసుకోవడం చాలా అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. మనం నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తలచర్మం కూడా పొడిబారకుండా తేమగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.ఇంకా నూనె రాసుకోవడం వల్ల పోషకాలు అంది జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అలాగే మనం రకరకాల నూనెలను కూడా రాసుకుంటూ ఉంటాము.ముఖ్యంగా మనలో చాలా మంది కూడా కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకుంటూ ఉంటారు. కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల జుట్టుకు చాలా మేలు కలుగుతుంది.దీనిలో ఉండే మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి పోషకాలు జుట్టును అందంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.ఇంకా కొందరు బాదం నూనెను కూడా రాసుకుంటూ ఉంటారు. బాదంనూనెను రాసుకోవడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గడంతో పాటు జుట్టు పొడి బారకుండా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఎదుగుదలలో కూడా మనకు సహాయపడతాయి. ఇంకా అదే విధంగా జుట్టుకు రాసుకోదగిన నూనెలల్లో ఆలివ్ నూనె కూడా ఒకటి.


తలలో పంగల్ ఇన్పెక్షన్ లను తగ్గించడంలో ఇంకా తల చర్మాన్ని తేమగా ఉంచడంలో ఈ నూనె మనకు సహాయపడుతుంది. ఇక జుట్టుకు నువ్వుల నూనెను ఇంకా ఆముదాన్ని కూడా రాసుకుంటూ ఉంటారు. ఈ నూనెలను రాసుకోవడం వల్ల ఫంగల్ ఇన్పెక్షన్ లు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, నల్లగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. అయితే మనలో చాలా మంది ఈ నూనెలను జుట్టుకు రాసుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉంటారు.ఇక కొందరు జుట్టుకు నూనె రాసుకుని రోజుల తరబడి అలాగే ఉంటారు.ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్పెక్షన్ లు వస్తాయి. కొంతమంది రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుని పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తలలో, నుదుటి మీద, కనుబొమ్మల మీద ఇంకా చెవుల వెనుక భాగంలో మచ్చలు వస్తాయి. ఇంకా అలాగే జుట్టుకు ఎక్కువ కాలం పాటు నూనెను ఉంచుకోవడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు కూడా వస్తాయి. జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే అయినప్పటికి నూనెను రాత్రంతా కూడా ఉంచుకోకూడదు. ఇంకా అలాగే రోజుల తరబడి కూడా ఉంచుకోకూడదు. తలస్నానం చేయడానికి అరగంట ముందు మాత్రమే నూనె రాసుకుని మర్దనా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: