తెల్లజుట్టుని కవర్ చేయడానికి కొందరు హెయిర్ డై లు వాడితే మరికొందరు హెన్నాని ఉపయోగిస్తారు. వీటివల్ల టెంపరరీగా తెల్లజుట్టు నల్లగా కవర్ అవుతుంది కానీ ఆ తరువాత కొన్ని రోజుల్లోపే మళ్లీ అది మామూలైపోతుంది. అయితే అలా కాకుండా తెల్లజుట్టు శాశ్వతంగా నల్లబడటానికి అదిరిపోయే పరిష్కారం ఇక్కడ ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కింద చెప్పుకున్న నూనెలో ఏదో ఒకటి బొడ్డులో వేసి మర్దనా చేసుకుంటూ ఉంటే కేవలం 7రోజుల్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఈ సూపర్ చిట్కా గురించి పూర్తీగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కొబ్బరినూనె మన జుట్టుకు తేమను అందిస్తుంది.ఈ నూనె జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. కొబ్బరినూనెను ఆరోగ్యకరమైన పద్దతిలో వాడితే జుట్టు నల్లగా, ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. అయితే లోపలి నుండి జుట్టు ఆరోగ్యంగా రావడానికి ఇంకా జుట్టుకు జీవం అందడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కొన్నిచుక్కల కొబ్బరినూనెను బొడ్డులో వేసి బాగా మర్థనా చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది.


గంధపునూనె..దీన్నే శాండల్ ఉడ్ ఆయిల్ అనికూడా అంటారు. ఈ నూనె జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు రాత్రి సమయంలో కొన్ని చుక్కల గంధపు నూనెను బొడ్డులో వేసి కాసేపు మర్దనా చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఇక ఆవనూనె  చలికాలంలో చాలా మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.


ఆవాల నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో వేసి మర్దనా చేసుకుంటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా ఇంకా తుమ్మెద రెక్కల్లా మారుతుంది.


అలాగే బాదం నూనెను సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. చర్మసంరక్షణలో కూడా దీన్ని విరివిగా వాడతారు. బాదం నూనెలో విటమిన్-ఇ అనేది ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది. ఇది తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బాదం నూనెను కొన్ని చుక్కలు బొడ్డు లో వేసి బాగా మర్థనా చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులలో జుట్టులో మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: