నేటి కాలంలో మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి ఇంకా పోషకాహార లోపం వంటి వివిధ కారణాల వల్ల మనలో చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం వల్ల చాలా మంది చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపిస్తారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి హెయిర్ డైలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ వీటిలో రసాయనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో జుట్టు సమస్యలు చాలా ఎక్కువవుతాయి. కాబట్టి మనం సహజ పద్దతుల ద్వారానే జుట్టును నల్లగా మార్చుకోవడం చాలా మంచిది.మనకు ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసివాడడం వల్ల చాలా ఈజీగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. తెల్లజుట్టును నల్లగా మార్చే ఈ టిప్ ఏమిటి.. ఇంకా దీనిని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం 5 మందార ఆకులను, గుప్పెడు గోరింటాకును, ఒక గుడ్డు తెల్లసొనను, ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని ఇంకా 3 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను, 3 టీ స్పూన్ల పెరుగును, అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని కూడా ఒక జార్ లో వేసి వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి దాకా బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కుంకుడుకాయలతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు క్రమంగా ఈజీగా నల్లగా మారుతుంది. వారానికి ఒకసారి ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు సమస్యలన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయి. పైగా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అందుకే తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: