చలికాలం మొదలైందంటే చాలు జ్వరం,జలుబు,దగ్గు ఎంత సర్వసాధారణమొ చుండ్రు కూడా అంతే సర్వసాధారణం అయిపోయింది.ఈ చుండ్రు అధిక దురదను కలిగించడమే కాకుండా,జుట్టు రాలడానికి కూడా దోహదపడుతూ,తెగ ఇబ్బంది పెడుతోంది.అటువంటి చుండ్రును తొలగించుకోవడానికి రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడిన పెద్దగా ఫలితం కనిపించడం లేదు.ఇలాంటి వారి కోసమే కొన్ని రకాల సహజ పదార్థాలతో తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు సైతం చెబుతున్నారు.ఆ హెయిర్ ప్యాక్ ఏంటో,వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో,అది ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

అధిక చుండ్రు రావడానికి కారణము సీజన్ మార్పు ఎంత కారణమో,మన శరీర దృక్పథం కూడా అంతే కారణం.కొంతమందికి హార్మోనల్ ఇమ్ బాలన్స్ వల్ల, చెడు కొలెస్ట్రాల్ అధికంగా తినడం వల్ల చుండ్రు వస్తూ ఉంటుంది.ఈ సమస్యలకు  నివారణ తప్పనిసరిగా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ గసగసాలు,రెండు టీ స్పూన్ల  పెరుగు,అర టీ స్పూన్ మెంతులు,అర టీ స్పూన్ నిమ్మరసం వేసి రెండు నుంచి మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి.ఇది బాగా నానిన తర్వాత ఆ వాటన్నిటిని  మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇది జుట్టుకు అప్లై చేయడానికి ముందు,జుట్టును బాగా దువ్వి చిక్కులు లేకుండా చేసి ఈ ప్యాక్ ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి గంట నుంచి రెండు గంటల సేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో  శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.తరువాత హెయిర్ సీరమ్ అప్లై చేయడంతో,జుట్టుకు అధిక తేమన అందిస్తుంది.

పెరుగులో ఉండే లాక్టిక్‌యాసిడ్‌ మరియు ప్రోబయాటిక్స్‌ కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.గసగసాల్లో ఉన్న హీలింగ్‌ ప్రాపర్టీస్‌,యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబియల్‌ గుణాలు చుండ్రు సమస్యకు నివారణ కలిగిస్తాయి.మెంతులలోని బయోటిన్‌, విటమిన్‌ ఎ,బి,సిలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే నిమ్మరసంలో ఉన్న యాస్ట్రిజెంట్‌ లక్షణాలు జిడ్డును దురదను తగ్గించి,చుండ్రు సమస్యకు చెక్‌ పెడతాయి.కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే కచ్చితంగా ఈ ప్యాక్ ని ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: