చాలా మంది అమ్మాయిల్లో ఇంకా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆవాంఛత రోమాలు సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యకి ఆయుర్వేదంలో చాలా రకాల చికిత్సలు ఉన్నాయి.ఆడవాళ్ళలో హార్మోన్ల అసహ్యం వల్ల వచ్చే అవాంచిత రోమాల సమస్యకి పరిష్కారం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అయితే వీటిని సహజంగా మీరు ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు. అందుకు చక్కటి ఆయుర్వేదం చిట్కాలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కర్పూరం బిళ్ళలను పొడిచేసి తీసుకోవాలి. తరువాత దానికి రెండు స్పూన్ల తెల్ల మిరియాల పొడిని కలపాలి.అలాగే కాస్త బాదం నూనెను జోడించి పేస్ట్ లా చేసే ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో నీట్ గా కడుక్కోవాలి. ఇలా రెండు నెలలపాటు వారానికి ఒకసారి చొప్పున ఇలా చేస్తూ వెళ్తే మెల్లగా వెంట్రుకలు రావడం తగ్గిపోతుంది. అలాగే పసుపు ఇంకా ఉద్దీ పప్పు పొడిచేసి నీళ్లలో కలిపి పేస్ట్ ని సిద్ధం చేసుకోండి.దానిని మీ ముఖానికి అప్లై చేయడం వలన అధిక నూనే బయటకు రాదు.


అలాగే ముఖంలోని అవాంఛత రోమాలు కూడా తగ్గుతాయి. ఇంకా అలాగే గుడ్డుని పగలగొట్టి తెల్లసొన మాత్రమే తీసుకొని దానికి కాస్తంత పిండిని కలపండి. ఇక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు పాటు అప్లై చేసి ఒక పది నిమిషాలు ముఖాన్ని అలాగే ఆరనివ్వండి.ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వలన రోమాలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే పచ్చి బొప్పాయిలో పపైన్ అనే క్రియాశీల ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ఈజీగా పరిమితం చేస్తుంది.ఎందుకంటే బొప్పాయి సున్నితమైన చర్మానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బొప్పాయి ప్యాక్ కోసం రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పేస్ట్ ఇంకా అర టీ స్పూన్ పసుపు పొడిని తీసుకుని దానిని పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ తో ముఖాన్ని ఒక 15 నిమిషాల పాటు మసాజ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి. మీరు మంచి ఫలితాలు కోసం వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: